
తెలంగాణలో గత ఏడాది కాలంలో 27 వేల మంది రైతులు మరణించినట్లు తేలింది. రైతు భీమా కోసం వ్యవసాయశాఖ లెక్కలు తీయగా ఈ విషయం బయటపడింది. ఆత్మహత్యలు, అనారోగ్యం, కరోనా, ఇతర కారణాల వల్ల ఆగస్టు 14, 2020 నుంచి ఈ ఆగస్టు వరకు చనిపోయిన రైతుల సంక్య 27 వేలుగా ఉంది. ఈ మరణాలన్నీ 18 నుంచి 60 ఏళ్ల మధ్య వారివే. 60 ఏళ్లు దాటిన వారికి రైతుబీమా వర్తించదు.