శాంతించిన కరోనా?

కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్రం ప్రకటించిన రోజువారీ బులెటిన్ లో24 గంటల్లో 2 లక్షల కన్నా తక్కువ కేసులు నమోదు కావడం విశేషం. 40 రోజుల తరువాత తొలిసారి రెండు లక్షల కన్నా తక్కువ కేసులు నమోదు కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. 24 గంటల్లో దేశంలో 3511 మంది మృత్యువాత పడ్డారు. రికవరీల సంఖ్య కూడా భారీగా పెరగడంతో ఊరటనిస్తోంది. కరోనా ప్రభావంతో మార్చి మూడో […]

Written By: Srinivas, Updated On : May 25, 2021 1:59 pm
Follow us on


కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్రం ప్రకటించిన రోజువారీ బులెటిన్ లో24 గంటల్లో 2 లక్షల కన్నా తక్కువ కేసులు నమోదు కావడం విశేషం. 40 రోజుల తరువాత తొలిసారి రెండు లక్షల కన్నా తక్కువ కేసులు నమోదు కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. 24 గంటల్లో దేశంలో 3511 మంది మృత్యువాత పడ్డారు. రికవరీల సంఖ్య కూడా భారీగా పెరగడంతో ఊరటనిస్తోంది.

కరోనా ప్రభావంతో మార్చి మూడో వారంలో ప్రారంభమైన సెకండ్ వేవ్ క్రమంగా అదుపులోకి వస్తోంది. వ్యాక్సినేషన్, పరీక్షలు, చికిత్సలు జరుగుతుండడంతో కరోనా నెమ్మదిస్తోంది. 40 రోజుల్లో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రెండు లక్షల కన్నా దిగువకు చేరుకుంది. కేంద్రం తాజాగా ప్రకటించిన హెల్త్ బులెటిన్ లో కేసులు తగ్గడంతో పాటు రికవరీలు పెరగడం కూడా శుభ పరిణామమే.

కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. రెండు వారాల క్రితం వరకు 4 లక్షలుగా ఉన్న రోజువారీ కేసులు 2 లక్షలకు తక్కువగా నమోదయ్యాయి. కేంద్రం ప్రకటించిన బులెటిన్ ప్రకారం 24 గంటల్లో1.96 లక్షల కొత్త కేసులు వెలుగు చూడడం చూస్తున్నాం. అయితే మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరణాల రేటు అధికంగా ఉండడం తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా రికవరీల సంఖ్య పె రుగుతోంది. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా నమోదైంది. గత 24 గంటల్లో 1.96 కొత్త కేసులు నమోదైతే 3.26 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీల సంఖ్య 2.4 లక్షలకు చేరుకుంది. తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2.69 కోట్లు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 25.86 లక్షలు గా నమోదయ్యాయి. మొత్తం మరణాలు 3.07 లక్షలకు చేరాయి.