
ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికైనట్లు ఆ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తా. 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం సకారంతో నుమాయిష్ ను విశ్వవ్యాప్తం చేద్దామని అన్నారు.