spot_img
Homeఆంధ్రప్రదేశ్‌IPAC strategy impact on YS Jagan: ఈ ఫలితాలు చూశాకైనా.. ఐప్యాక్ ను జగన్...

IPAC strategy impact on YS Jagan: ఈ ఫలితాలు చూశాకైనా.. ఐప్యాక్ ను జగన్ వదులుకోరా!

IPAC strategy impact on YS Jagan: దేశంలో ఐప్యాక్( I pak ) ప్యాకప్ అవుతోందా? ప్రజల నాడిని పట్టుకోలేకపోతోందా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎన్నికల వ్యూహ బృందానికి చేదు ఫలితాలను ఇచ్చాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తొలుత ఏపీలో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ను గట్టెక్కించలేకపోయింది ఐ ప్యాక్. ఇక ఆ వ్యూహబృందం పని అయిపోయిందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాక దాని పతనం ప్రారంభమైనట్లు స్పష్టమైంది. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది.

పూర్వం ఎంతో వైభవం..
ఒకప్పుడు ఐప్యాక్ రంగంలోకి దిగింది అంటే విజయం ఆ పార్టీ కి దక్కినట్టే. 2014లో ప్రధాని మోదీ.. తరువాత మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, జగన్మోహన్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఐ ప్యాక్ అమ్ముల పొదిలో ఎన్నో విజయాలు ఉండేవి. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ నుంచి తప్పుకున్నారో అప్పటి నుంచి కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఐప్యాక్ వ్యవస్థాపకుడు అరెస్ట్.. అటు తరువాత ఆ సంస్థలో కుమ్ములాటలు పూర్తిగా బలహీనపరిచాయి. మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు ఐప్యాక్ దోహద పడింది. అధికారంలో ఉన్న పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మాత్రం ఐపాక్ వ్యూహాలు పనిచేయలేదు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కెసిఆర్, ఇప్పుడు మమతా బెనర్జీ తో పాటు స్టాలిన్ ఇదే పరిస్థితి ఎదురయింది.

పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ సలహాలు..
తన కోసం తాను రూపొందించుకున్న వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ కు( Prashant Kishor) బీహార్ లో పనిచేయలేదు. కానీ ఆయన రాజకీయ పార్టీలకు అందించిన వ్యూహాలు మాత్రం పనిచేశాయి. ఏపీలో మొన్న కూటమికి సలహాలు ఇవ్వడం ద్వారా తాను అనుకున్నది సాధించగలిగారు ప్రశాంత్ కిషోర్. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఐప్యాక్ ప్యాకప్ కావడం ఖాయమని తేలిపోయింది. అంతలా నిరాశకు గురిచేసాయి ఫలితాలు. అయితే ఇదే ఐ ప్యాక్ కు నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏపీలో. మొన్నటి ఎన్నికల్లో గట్టెక్కించలేకపోయారు కానీ ఇంకా నమ్మకం పెట్టుకున్నారు. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ ను వదులుకోవడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version