
ఏపీలో కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో తొలి డెల్టాప్లస్ కేసు నమోదైన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు.