Bangladesh Politics : ఇండియన్ సినిమా మార్కెట్ మొత్తాన్ని ఇప్పుడు దురంధర్ సినిమా దున్నేస్తోంది. ఇప్పటికే 1000 కోట్ల వసూళ్లను సాధించింది. తద్వారా ఈ ఏడాది ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దురంధర్ సినిమా దెబ్బకు చావా, కాంతారా చాప్టర్ వన్ వంటి సినిమాలు సాధించిన రికార్డులు బద్దలైపోయాయి.
దురంధర్ సినిమాలో రణవీర్ సింగ్ పరకాయ ప్రవేశం చేశారు. ఒకరకంగా ఆ పాత్ర కోసం మాత్రమే రాసినట్టుగా వెండితెర మీద చెలరేగిపోయారు. పాకిస్తాన్ మీద కోపం.. పాకిస్తాన్లో ఒక ఇండియన్ రా ఏజెంట్ ప్రవేశించి.. అక్కడ వ్యవస్థలను మొత్తం నాశనం చేస్తే ఎలా ఉంటుంది.. అనే కోణాలలో ఈ సినిమా కథ సాగింది. దేశభక్తి మెండుగా ఉన్న ఈ సినిమా ప్రతి ఒక్క ఇండియన్ కు కనెక్ట్ అయింది. అంతేకాదు ఈ సినిమాలో చాలామంది ఆడియన్స్ తమరు తాము జస్టిఫై చేసుకున్నారు. అందువల్లే ఈ స్థాయిలో వసూళ్లను అందుకుంటున్నది.
దురంధర్ ను ఒక సినిమా లాగా కొంతమంది చూస్తుంటే.. మిగతావారేమో దాన్ని రియలిస్టిక్ లైఫ్ కి అప్లై చేస్తున్నారు. దురంధర్ సినిమాలో అక్షయ్ కన్నా పోషించిన పాత్రకు.. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలకు ముడిపెడుతున్నారు. వాస్తవానికి ఆ సినిమాలో జరిగిన పరిణామాలు.. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిస్థితులకు దాదాపు ఇంటర్ లింకు ఉన్నట్టే కనిపిస్తోంది.
బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి తారీక్ రెహమాన్ అనే వ్యక్తి ప్రవేశించారు. దాదాపు 17 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత ఆయన బంగ్లాదేశ్ గడ్డమీద అడుగు పెట్టారు. ఇతడు మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు. రెహమాన్ ఒకప్పుడు బంగ్లాదేశ్ లో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో ఒకడిగా ఉండేవాడు. 2001 నుంచి 2006 మధ్య బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖలీదా జియా ప్రధాన మంత్రిగా కొనసాగారు. అప్పుడు రెహమాన్ డి ఫ్యాక్టో పవర్ సెంటర్ గా ఉన్నారు. 2005లో రెహమాన్ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో చికిత్స పేరుతో లండన్ వెళ్లిపోయారు. దాదాపు అక్కడే 17 సంవత్సరాలు పాటు ఉన్నారు. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద అనేక రకాలుగా కేసులు నమోదయ్యాయి.
గత ఏడాది ఈ కేసులు మొత్తం కోర్టు ద్వారా పరిష్కారమయ్యాయి. తద్వారా రెహ్మాన్ కు విముక్తి లభించింది.. ఇప్పుడు ఆయన దేశానికి తిరిగి వచ్చారు. “ఎటువంటి పార్టీ లేదు. మతం అంతకంటే లేదు. దేశంలో శాంతి మాత్రమే కావాలి. చట్టాల సంరక్షణ ఉండాలి. అందరం కలిసి పనిచేయాలి” అంటూ వ్యాఖ్యానించాడు.. అంతే కాదు, అమెరికా నల్లజాతీయుల పోరాటయోధుడు Martin Luther King మాట్లాడిన I have a plan అనే మాటలు రెహమాన్ ఇటీవల జరిగిన సభలో ప్రస్తావించారు. బంగ్లాదేశ్ గడ్డమీద అడుగుపెట్టిన తర్వాత విమానాశ్రయం నుంచి తన ఇంటి వరకు రెహమాన్ భారీ బల ప్రదర్శన చేశారు. ఇందుకోసం 10 ప్రత్యేక రైళ్లలో మూడు లక్షల మంది దాకా డాకా వచ్చారు.
రెహమాన్ బంగ్లాదేశ్ రావడాన్ని భారత అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఎందుకంటే జమాతే ఏ ఇస్లామి బంగ్లాదేశ్లో బలపడుతోంది. తాత్కాలిక యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్ పాట పాడుతోంది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని తక్కువ ప్రమాదం ఉన్న ప్రత్యామ్నాయంగా భారత్ భావిస్తోంది.. New Delhi.. no Pindi.. Bangladesh everything before we thinking.. ఢిల్లీ అవసరం లేదు. పిండి అనేది ముఖ్యం కాదు.. ముఖ్యంగా మన ఆలోచనలో బంగ్లాదేశ్ మాత్రమే ఉండాలి.. రెహమాన్ ఈ తీరుగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి కచ్చితంగా భారత్ జాగ్రత్తగానే ఉండాలి..
కాకపోతే, దురంధర్ సినిమాలోని అక్షయ్ కన్నా మాదిరిగా రెహమాన్ కూడా బంగ్లాదేశ్లో మారిపోతే.. అప్పుడు పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. అచ్చం కేజిఎఫ్ ను రాకీ భాయ్ ఆక్రమించినట్టు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో.. మోడీ ఏం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కాలంలో ప్రతి దేశంతో దౌత్య సంబంధాలు అనుకూలంగా ఉండాలి. మన ఇల్లు మాత్రమే బాగుంటే సరిపోదు. పక్కనున్న ఇల్లు మంటల్లో కాలిపోవద్దు. ఎందుకంటే ఆ మంటలు ఏ క్షణమైనా సరే మన ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది. అలా రాకముందే ఆ మంటల మీద మనకు అవసరం లేకపోయినప్పటికీ నీళ్లు చల్లాలి.. ఇప్పుడు భారత్ చేస్తున్నది కూడా అదే.