
ఇప్పటికే అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్ ధాటికి పశ్చిమతీరం అతలాకుతలం అయ్యింది. తౌక్టే ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే ఇప్పడు తూర్పు తీరానికి మరో తుఫాన్ ముంచుకొస్తున్నది. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 25 కల్లా తీవ్ర తుఫాన్ గా మారనుంది. ఈ రాబోయే తుఫాన్ కు యాస్ అని పేరు పెట్టారు. ఈ యాస్ తుఫాన్ మే 26, 27 తేదీల్లో తూర్పు తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన 72 గంటల్లో అది మరింత బలపడి తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.