
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో తాజాగా 23,160 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్ తో 106 మంది చనిపోయారు. తాజా కేసులతో కలుపుకొని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532 కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736 గా ఉంది. కరోనా తో ఇప్పటి వరకు ఏపీలో 9,686 మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 17 మంది మరణించారు. నెల్లూ, విశాఖపట్నంలో 11 మంది చొప్పున చనిపోయారు.