కొవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో తమ జీవితాలను, కుటుంబాలను పక్కన పెట్టి వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు సేవలందించారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వారి సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ఈసారి వైద్యులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ పురస్కారం కొవిడ్ సమయంలో విశేష సేవలందించిన వారందరికీ దక్కాలనీ, అవసరమైతే నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రధానికి సూచించారు.