
వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా వృద్ధాప్య పింఛన్లు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.