https://oktelugu.com/

సిరిసిల్లను సుభిక్షంగా మారుస్తాం: కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా తొలుత మండేపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. అక్కడ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో రూ.83.37 కోట్లతో 27 ఎకరాల్లో మొత్తం 1,320 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు.ఈ సందర్భంగా కేసీఆర్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : July 4, 2021 / 07:13 PM IST
    Follow us on

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా తొలుత మండేపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. అక్కడ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో రూ.83.37 కోట్లతో 27 ఎకరాల్లో మొత్తం 1,320 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు.ఈ సందర్భంగా కేసీఆర్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    అనంతరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ రీసెర్డ్ కేంద్రంతో పాటు మండేపల్లిలో నిర్మించిన ఐడీటీఆర్ శిక్షణ కేంద్రాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు.20 ఎకరాల స్థలంలో రూ.16.48 కోట్లతో ఈ ఐడీటీఆర్ ను నిర్మించారు. ఈ కేంద్రంలో నెలకు 400 మందికి పైగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లలో సీఎం నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. రూ.36.45 కోట్లతో 5 ఎకరాల్లో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. అధునాతన హంగులతో కళాశాల వసతి గృహాలను నిర్మించారు.
    దీంతో పాటు సిరిసిల్ల మార్కెట్ కమిటీ సముదాయం, గిడ్డంగులను కేసీఆర్ ప్రారంభించారు. సర్సాపూర్ మార్కెట్ యార్డుకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ రైతుల కోసం సకల వసతులతో మార్కెట్ యార్డు ఏర్పాటు చేశారు. రూ.20 కోట్లతో 20 ఎకరాల్లో యార్డును నిర్మించారు. అనంతరం సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించారు. సకల సౌకర్యాలతో రూ.64.70 కోట్లతో 93.33 ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు.
    అనంతరం ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చేందుకు కార్యాచరణ మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో మిడ్ మానేరు జలాశయం రూపొందించినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకే పని చేస్తామని చెప్పారు.  ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి అవసరాలుతీర్చడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రజా సేవలో ఎంత దాకా అయినా వెళతామని చెప్పారు. అనుక్షణం ప్రజా సంక్షేమమే మాకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.