
మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నట్లు ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. దిశ చట్టం తెచ్చాక గతంలో ఉన్న దర్యాప్తు వ్యవధిని గణనీయంగా తగ్గించామని.. ప్రస్తుతం కేవలం 42 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నామన్నారు. ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చట్టం కింద ఇప్పటి వరకు 180 మంది దోషులకు శిక్ష విధించగా వారిలో ముగ్గురికి ఉరిశిక్ష పడిందన్నారు. దిశ యాప్ ను మహిళలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.