
తెలంగాణలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, ఉమేశ్ షరాఫ్, గోవింగ్ సింగ్, రవిగుప్త డీజీపీలుగా పదోన్నతి పొందారు. ఈ నలుగురు ఐపీఎస్ లకు అదనపు డీజీ హోదా నుంచి డీజీపీ హోదా లభించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఐజీ స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు.