
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం అని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. పల్లెలు, పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు అంతా కంకణబద్దులు కావాలన్నారు.