
గత కొన్నిరోజులుగా చికెన్ ప్రియులను కలవరపెట్టిన చికెన్ ధరలు దిగి వస్తున్నాయి. గత వారం రిటైల్ మార్కెట్ లో కిలో 200 రూపాయలు కాగా ఆదివారం కిలోకు 160 రూపాయలకు చేరింది. కరోనా సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్న నేపధ్యంలో చికెన్ కోడిగుడ్ల వినియోగం బాగా పెరిగింది. పైగా ఈ రెండు కూడా వేడిని కలిగించేవి వావడంతో ఎక్కువ మంది వీటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు.