
మహారాష్ట్రలో రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. రత్నగిరి సమీపంలోని సొరంగంలో రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే రైలులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. దిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గోవా మడ్గావ్ వైపు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది.