
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందిరాపార్కు వద్ద 200 మందితో సమావేశమయ్యేందుకు మాత్రమే అనుమతిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుతో చలో రాజ్ భవన్ కార్యక్రమానికి బయల్దేరుతుండగా పలుచోట్ల ఆ పార్టీ నేతలను పోలీసులు ముందుస్తుగా ఇళ్ల వద్దే నిర్బంధించారు. కార్యకర్తలు తరలివెళ్లకుండా కట్టడి చేస్తున్నారు.