
కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. గత నెలలో మధ్య ప్రదేశ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ తో ఒకరు మరణించినట్లు వార్తలు రాగా తాజాగా మహారాష్ట్రలో తొలి మరణం సంభవించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. రత్నగిరి జిల్లా సంఘమేశ్వర్ ప్రాంతంలో 80 ఏల్ల వృద్ధురాలు డెల్టా ప్లస్ వైరస్ బారినపడి మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. అయితే ఆమెకు వయోసంబంధమైన ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు తెలిపారు.