
దేశవ్యాప్తంగా కరోనా కాస్త తగ్గు ముఖం పట్టింది. వరుసగా నాలుగో రోజు 3 లక్షల లోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,81,386 మంది వైరస్ బారిన పడ్డారు. 3,78,741 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్ ఫెక్షన్ కారణంగా 4,106 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 2,49,65,463కు పెరిగాయి, 2,11,74,076 మంది కోలుకున్నారు. ఇంకా 35 లక్షల పైగా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 2.74 లక్షల మంది పైగా మరణించారు.