
లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,261 కేసులు నమోదు కాగా, 18 మంది మరణించారని డీహెచ్ వెల్లడించారు. కరోనా బారి నుంచి నిన్న 3,043 మంది కోలుకున్నారని చెప్పారు. కరోనా పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందని వెల్లడించారు. గ్రామాల్లోనూ పకడ్బందీగా లాక్ డౌన్ అమలు కావాలని సూచించారు.