
దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 45,951 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అంతకుముందు రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 22 శాతం పెరుగుదల కనిపించింది. మరణాల సంఖ్యలో మాత్రం తగ్గుదల కొనసాగుతోంది. తాజాగా 817 మంది మరణించారు. ఇక దేశంలో మొత్తం కేసులు 3,03,62,848కి చేరగా 3,98,454 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.