
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 2 రోజులుగా 40 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 15,26,056 టెస్టులు చేస్తే 31,222 మందికి పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో 290 మంది మరణించారు. మొత్తం కేసులు 3,30,58,813కు చేరింది. దేశంలో ప్రస్తుతం 3,92,864 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 69.90 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.