
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,689 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. 132 రోజుల తర్వాత 30 వేలకు దిగువన కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. తాజాగా 42,363 మంది బాధితులు కోలుకోగా మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.14 కోట్లకు పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 3,06,21,469 మంది బాధితులు కోలుకున్నారు.