
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 52,970 వద్ద.. నిఫ్టీ 45 పాయింట్ల లాభపడి 15,869 వద్ద కొనసాగుతోంది. టెక్ కంపెనీల పై చానా నియంత్రణతో పడిపోయిన ఆసియా సూచీలు నేడు కాస్త కోలుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలు రూ. 74.34 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క అమెరికా సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి.