
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 381 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 34 మంది మరణించారు. 1189 మంది కోలుకున్నారు. మార్చి 9వ తేదీ తర్వాత కేసులు సంఖ్య ఇంత తక్కువగా రావడం ఇదే తొలిసారి. శనివారం 414 కేసులు నమోదు కాగా ఆ సంఖ్య మరింత తగ్గింది. ఇక పాజిటివిటీ రేటు 0.5 శాతానికి పడిపోయింది.