
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 66,657 నమూనాలను పరీక్షించగా 1,578 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,24,421కి చేరింది. తాజాగా 22 మంది కరోనా మహమ్మారికి మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,024కి చేరింది. తాజాగా 3,041 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది.