
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉండే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ డెడ్ లైన్ విధించారు. కాంగ్రెస్ లోని ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చిరించారు. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.