
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 91,677 శాంపిల్స్ ను పరీక్షించగా వీటిలో 2,665 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. కాగా కొవిడ్-19తో తాజాగా 16 మంది మరణించారు. 3,231 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,19,948కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,680గా ఉంది.