బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా ప్రకటించండి

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు కొవిడ్ నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ కలవరపెడుతోంది. దీంతో కేంద్రం దీన్ని అంటువ్యాధుల చట్టం కింద పరిగణించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి  లవ్ అగర్వాల్ రాష్ట్రాలకు లేఖను పంపారు. ఇక పై బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయిన వారి వివరాలను రాష్ట్రాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులు, కళాశాలలు […]

Written By: Suresh, Updated On : May 20, 2021 8:19 pm
Follow us on

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు కొవిడ్ నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ కలవరపెడుతోంది. దీంతో కేంద్రం దీన్ని అంటువ్యాధుల చట్టం కింద పరిగణించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి  లవ్ అగర్వాల్ రాష్ట్రాలకు లేఖను పంపారు. ఇక పై బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయిన వారి వివరాలను రాష్ట్రాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులు, కళాశాలలు బ్లాక్ ఫంగస్ నిర్ధారణ, చికిత్సకు కేంద్రం సూచించిన మార్గదర్శకాలు అనుసరించాలి అని పేర్కొన్నారు.