
బైక్ ప్రమాదంలో గాయపడిన హీరో సాయి ధరమ్ తేజ్ కు కాలర్ బోన్ సర్జరీపై డాక్టర్లు నేడు నిర్ణయం తీసుకోనున్నారు. యాక్సిడెంట్ లో కాలర్ బోన్ ఫ్రాక్చర్ కావడంతో దానిపై వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల ఫలితాలను బట్టి ఆపరేషన్ నిర్వహించడంపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. చికిత్సకు స్పందిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం కాలేదని చెప్పారు.