
ఏడాదిన్నరకు పైగా గడగడలాడిస్తోన్న కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటోంది. భారత్ లో ఇప్పటివరకు ఈ మహమ్మారి 4లక్షల మందిని బలితీసుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు సంఖ్య 4,00312కు చేరింది. ఇక దేశంలో కొత్తగా మరో 46వేల మందికి కరోనా సోకగా 59వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.