పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్స్ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి
కరోనా టీకాల విషయంలో భారత్ బయోటెక్ ముందడుగు వేసింది. 2-18 వయస్కుల పై టీకా క్లినికల్ ట్రయల్స్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫారుసు మేరకు ఫేజ్ -3 ఫేజ్ -2 ట్రయల్స్ నిర్వహణకు అనుమతులు జారీ చేసింది. 252 మంది వలంటీర్లపై భారత్ బయోటెక్ కంపెనీ ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్ లో భాగంగా 28 రోజుల్లోపు రెండు డోసుల వ్యాక్సిన్ ను వేయనున్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ […]
కరోనా టీకాల విషయంలో భారత్ బయోటెక్ ముందడుగు వేసింది. 2-18 వయస్కుల పై టీకా క్లినికల్ ట్రయల్స్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫారుసు మేరకు ఫేజ్ -3 ఫేజ్ -2 ట్రయల్స్ నిర్వహణకు అనుమతులు జారీ చేసింది. 252 మంది వలంటీర్లపై భారత్ బయోటెక్ కంపెనీ ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్ లో భాగంగా 28 రోజుల్లోపు రెండు డోసుల వ్యాక్సిన్ ను వేయనున్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ ఢిల్లీ, పాట్నా నాగాపూర్ మెడిట్రినా సంస్థలో జరుగనున్నాయి.