
కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి దళితులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. నిన్న ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ఆ గ్రామానికి దళిత బంధు నిధులను విడుదల చేశారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు నిధుల విడుదలకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దళిత బంధు నిధులు విడుదల కావడంతో వాసాలమర్రి దళితులు సంబరాలు చేసుకుంటున్నారు.