ప్రశాంత్ కిషోర్ రాజీనామా వెనుక కారణాలేంటి?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్నాళ్ల పాటు విరామం తీసుకోనున్నారు. ఆయన ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రజా జీవితం నుంచి విరామం తీసుకునే క్రమంలో ఉన్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటికైతే రాజకీయాలతో సంబంధ లేకుండా ప్రశాంతంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు బెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ర్ట తదితర స్టేట్లలో అధికారం చేజిక్కించుకోవడానికి […]

Written By: Srinivas, Updated On : August 5, 2021 1:29 pm
Follow us on

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్నాళ్ల పాటు విరామం తీసుకోనున్నారు. ఆయన ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రజా జీవితం నుంచి విరామం తీసుకునే క్రమంలో ఉన్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటికైతే రాజకీయాలతో సంబంధ లేకుండా ప్రశాంతంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

ఇన్నాళ్లు బెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ర్ట తదితర స్టేట్లలో అధికారం చేజిక్కించుకోవడానికి పరోక్షంగా సహకరించిన పీకే ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా మంచిపేరు తెచ్చుకున్న పీకే కొద్ది కాలమైనా ఏ గొడవలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. గత కొద్ది కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉండి ఎప్పుడు వ్యూహాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చిన పీకే ఇప్పుడు దూరంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లతో భేటీ అయ్యాక పీకే పార్టీలో చేరతారని ప్రచారం సాగింది. పీకే చేరికపై రాహుల్ గాంధీ సీనియర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. పీకే బయట ఉండి సలహాలు, సూచనలు ఇచ్చేకంటే పార్టీలో ఉంటే ఇంకా మేలు జరుగుతుందని నాయకులు భావిస్తున్నారు. పీకే పాత్రపై ఇప్పటికే పలువురు నేతలు తమ వైఖరి వెల్లడించారు. పార్టీలో చేరితేనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే పీకే కాంగ్రెస్ లో చేరతారనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే పీకే భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఆయన చేరతారనే దానిపై ఊహాగానాలు వస్తున్నప్పటికి పీకే మాత్రం ఇంతవరకు తన అభిప్రాయాలు వెల్లడించలేదు. సమయం వచ్చినప్పడు మాత్రమే పీకే తన వైఖరి వెల్లడిస్తారని తెలుస్తోంది. దీంతో పార్టీవర్గాల్లో పీకే రాక కోసం ఎదురు చూస్తున్నారు. పీకే వస్తేనే పార్టీ భవిష్యత్ గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.