
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో పోలీసులు రూ. కొటి విలువైన 7.2 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు నిందితులు మోరెనా జిల్లా వాసులని, ఇందులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు స్మగ్లర్లు ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నుంచి గంజాయి అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. కిలో గంజాయిని చిత్తూరులో రూ. 2,800 నుంచి రూ. 3 వేలకు చొప్పున తీసుకువచ్చి ఇక్కడ రూ. 15 వేల చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. పోలీస్ రిమాండ్ లో ఉన్న నిందితులను విచారిస్తున్నట్లు తెలిపారు.