Crime News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. మే 13వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న బానోత్ రమేష్, స్వప్న దంపతుల కుమార్తె నిహారిక గాయత్రి (5)పై పిచ్చికుక్క దాడి చేసింది. మొదట కొత్తగూడెం ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేసి ఇంటికి పంపించినా, మే 25న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. నోటినుండి నురుగు రావడంతో ఖమ్మం, ఆపై హైదరాబాద్‌కు తరలించిన తల్లిదండ్రులు, అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.
ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. మిస్ వరల్డ్ పోటీదారుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటే, సామాన్య ప్రజల జాగ్రత్తల విషయానికొచ్చేసరికి అధికారుల నిర్లక్ష్యం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.