Chiranjeevi – Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధించగలిగే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన 8 సినిమాల్లో ఎనిమిది సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడం విశేషం. ఇక ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాతో తొమ్మిదవ విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాను ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ చేస్తాను అనే ఒక కాన్ఫిడెంట్ తో ఆయన ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతారను ఎంచుకున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి కూడా అవకాశం ఉండడంతో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ను ఎవరు కొట్టేశారు అనే ధోరణి లో కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) నటించే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
ఎందుకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankaranthiki Vastunnam) సినిమాలో మీనాక్షి చౌదరి చాలా అద్భుతమైన నటనను కనబరిచి తన నటన పరిణీతిని చూపించి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా ఆమె నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మరి ఈ సినిమాలో కూడా చిరంజీవికి జోడిగా సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించబోతుంది అనే వార్తలైతే వస్తున్నాయి.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
నిజానికి ఆమెకి ఉన్న క్రేజ్ కి ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించాల్సిన అవసరం లేదు. కానీ అనిల్ రావిపూడి తో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఆమె ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆమె తనదైన రీతిలో సత్తా చాటుకుంటుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇప్పుడు తన మార్క్ స్టైల్ తో ఈ సినిమాలో చిరంజీవిని చాలా కొత్తగా చూపించడమే కాకుండా వింటేజ్ చిరంజీవిని చూపించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోబోతున్నారని తన టీం నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. ముఖ్యంగా చిరంజీవి అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అతన్ని చూపించి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…