Covid Cases: ఇండియాలో మళ్లీ కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. దేశంలో మొత్తం 2710 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు అయ్యాయి. కేరళలో అత్యదిక కేసులు నమోదు అవుతున్నాయి. నాలు రోజుల్లోనే కేసులు వేగంగా పెరిగినట్ల గణాంకలు సూచిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.