
రెండో దశలో కరోనా మహమ్మారి వందల మంది ప్రాణదాతలను బలితీసుకుంది. రెండో ఉద్ధృతిలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 550 మంది వైద్యులు వైరస్ తో ప్రాణాలు కోల్పోయినట్లు భారత వైద్య మండలి శనివారం వెల్లడించింది. అత్యధికంగా దిల్లీలో 104 మంది డాక్టర్లు కరోనాతో మృతి చెందగా ఆ తర్వాత బీహార్ 96 మంది, ఉత్తరప్రదేశ్ లో 53, రాజస్తాన్ లో 42, గుజరాత్ లో 31, ఆంధ్రప్రదేశ్ లో 29, తెలంగాణలో 29, పశ్చిమ బెంగాల్ లో 23, తమిళనాడులో 21 మంది వైద్యులు వైరస్ కారణంగా చనిపోయినట్లు ఐఎంఏ తెలిపింది.