చంద్రబాబుకు అధికారం పగటి కలే?

అధికారం కోసం వెంపర్లాడడం మామూలుగా చూస్తాం. రాజకీయ పార్టీలు తమ ప్రాభవం కోసం అనేక మార్గాలు వెతుకుతుంటారు. ఒక్కో పార్టీది ఒక్కో ప్రత్యేకత. ప్రస్తుతం టీడీపీ మాత్రం గడియారాన్ని నమ్మకుంది. అధినేత చంద్రబాబు పార్టీ పరిధిని మించి అతిగా ప్రవర్తిస్తున్న అధికార యంత్రాంగానికి హెచ్చరిక పంపడానికి గడియారం సిద్ధాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ లో ఉన్న వైసీపీ మీద వ్యతిరేకత తమకు పట్టం కడుతుందని టీడీపీ భావిస్తోంది. ఇది అత్యాశే అవుతుంది. తిరిగి తాము అధికారంలోకి […]

Written By: Srinivas, Updated On : May 29, 2021 12:39 pm
Follow us on

అధికారం కోసం వెంపర్లాడడం మామూలుగా చూస్తాం. రాజకీయ పార్టీలు తమ ప్రాభవం కోసం అనేక మార్గాలు వెతుకుతుంటారు. ఒక్కో పార్టీది ఒక్కో ప్రత్యేకత. ప్రస్తుతం టీడీపీ మాత్రం గడియారాన్ని నమ్మకుంది. అధినేత చంద్రబాబు పార్టీ పరిధిని మించి అతిగా ప్రవర్తిస్తున్న అధికార యంత్రాంగానికి హెచ్చరిక పంపడానికి గడియారం సిద్ధాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ లో ఉన్న వైసీపీ మీద వ్యతిరేకత తమకు పట్టం కడుతుందని టీడీపీ భావిస్తోంది. ఇది అత్యాశే అవుతుంది. తిరిగి తాము అధికారంలోకి వస్తామని అనుకోవడం భ్రమే అవుతుంది.

కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలే టీడీపీకి కలిసొచ్చేది. పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలన్న తాపత్రయం సమష్టిగా కనిపించేది కాదు. అందరూ ఒకే బాటగా టీడీపీని ఎదుర్కోవడం అరుదు. దీంతో కాంగ్రెస్ కంటే తెలుగుదేశానికి ఆదరణ లబించేది. ముఠా కుమ్ములాటలు టీడీపీకి మార్గం సుగమమం చేసేవి. దీంతో జగన్ ప్రభుత్వం రావడంతో టీడీపీ ఆశలు వమ్ము అయ్యాయి. వైసీపీ వ్యూహంలో భాగంగానే టీడీపీ ని ప్రభుత్వ వర్గాలు వెంటాడున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయుకలను వేధిస్తున్నారని తె లిసినా ప్రజల నుంచి మద్దతు లభించడం లేదు.

కార్గిల్ యుద్దం నేపథ్యంలో 1999లో బీజేపీ అధికారం చేజిక్కించుకోగా అదే ఊపులో టీడీపీ దానితో జతకట్టి లబ్ది పొందింది. 2004, 2009లో టీడీపీకి పరాభవం తప్పలేదు. 2014 నాటికి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీక ప్రజల్లో అపరిమితమైన మద్దతు ఉంది. రాష్ర్ట విభజనతో ప్రజలు పునరాలోచనలో పడ్డారు. దీంతో బాబుకు మోదీ, పవన్ కల్యాణ్ తోడు కావడంతో ఆంధ్రలో టీడీపీ విజయం సాధించింది. జగన్ ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది.

ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీ ప్రతిష్ట దిగజారిపోయింది. గడియారాన్నినమ్ముకున్న బాబు మళ్లీ అధికారంలోకి రావడం గగనమైపోతోంది. అమరావతి నగరం నిర్మించాలంటే తనకే మళ్లీ అదికారం ఇవ్వాలనే పదేపదే చెప్పడంతో ప్రజలు నమ్మలేదు. రైతులను కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలు ఓట్లు వేయలేదు. ఫలితంగా టీడీపీ ఫలితం తలకిందులైంది. అధికారం వైసీపీ వంతైంది. ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. రాజకీయ ఎత్తుగడలతోనే పగ్గాలు చేతికొస్తాయనుకుంటే పొరపాటే. పనితనం ఆధారంగానే అధికారం సొంతమవుతుందని గుర్తించాలి.