
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 25 వేలకు దిగిరాగా తాజాగా 35వేలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 37,169 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. మరో 440 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.14 శాతం ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్ కేసులున్నాయని, 148 రోజుల తర్వాత కనిష్టానికి చేరుకున్నాయని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.52 శాతానికి చేరుకుందని పేర్కొంది.