
వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రి భవనం పైనుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ కరోనా లక్షణాలతో ఈనెల 24న ఆస్పత్రిలో చేరాడు. మరుసటి రోజు కొవిడ్ నిర్ధారణ కావడంతో అప్పటినుంచి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మనస్థాపానికి గురైన బాధితుడు ఎంజీఎం ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.