
అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం ఆయన కొంతసేపటి క్రితం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ధ్రువీకరించారు. తనకు కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నాను అని కరోనా పాజిటివ్ అని వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనతో కలిసి పని చేసిన వారందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.