
కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా కేరల నుంచి రాష్ట్రానికి వస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలుపుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన నాలుగు రోజుల్లో కేరళలో సుమారు 20 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమై ఆంక్షలు విధించింది.