
దేశంలో కరోనా రెండోదశలో ప్రతాపం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ బాటపట్టగా పలు రాష్ట్రాలు అదే తరహా నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. దీంతో జనం బయటకు రావడం లేదు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడుతోంది. సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేశారు. తాజాగా ఈశాన్య సరిహద్దు రైల్వే 31 రైళ్లను బుధవారం రద్దు చేసింది.