Telugu News » Latest News » Minister ik reddy reviewing the implementation of the lockdown
లాక్ డౌన్ అమలును పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలు తీరును అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బుధవారం పట్టణంలో లాక్ డౌన్ ఏవిధంగా అమలవుతున్నాయో ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వర్తకులు, చిరువ్యాపారులను కలిసి ప్రజలు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సమయంలో లాక్ డౌన్ నియమాలు అమలు పరచడంలో భాగంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచిస్తూ లాక్ […]
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలు తీరును అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బుధవారం పట్టణంలో లాక్ డౌన్ ఏవిధంగా అమలవుతున్నాయో ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వర్తకులు, చిరువ్యాపారులను కలిసి ప్రజలు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సమయంలో లాక్ డౌన్ నియమాలు అమలు పరచడంలో భాగంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచిస్తూ లాక్ డౌన్ నియమాలు కఠినంగా అమలు చేయాలని తెలిపారు.