
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. శుక్రవారం 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు చేరింది. ఇందులో 3,18,51,802 మంది బాధితులు కోలుకున్నారు. 4,37,370 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 3,59,775 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.