
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 25,072 మంది మహమ్మారి బారిన పడగా 389 మంది మరణించారు. మొత్తం కేసులు 3. 24 కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756 గా ఉంది. నిన్న 44,157 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.16 కోట్ల కు చేరాయి. కొద్ది రోజులుగా క్రియాశీల కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,33,924 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు.