
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 4 లక్షల పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా హెల్త్ బులిటెన్ ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దేశంలో కొత్తగా 4,14,188 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 3,915 మంది మరణించారు. దేశంలో మొత్తం 2.14 కోట్ల కరోనా కేసులు నమోదవగా 2.34 లక్షల మంది ఇప్పటి వరకూ కరోనాతో మరణించారు. దేశంలో ప్రస్తుతం 36.45 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 81.95 ఉండగా మరణాల రేటు 1.09 గాఉంది దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 16.49 కోట్ల మందికి కరోనా టీకాలు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.