
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత అదుపులోకి వస్తోంది. తాజాగా 17,35,781 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 51,667 మందికి పాజిటివ్ గా తేలింది. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 4.4 శాతం తగ్గుదల కనిపించింది. తాజాగా 1,329 మంది మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,34,445కి చుకగా 3,93,310 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక నిన్న 64,527 మంది కొవిడ్ నుంచి కోలుకోగా మొత్తం రికవరీలు 2,91,28,267కి చేరాయి.